కళ్యాణదుర్గం: ఆర్డీటీ నిలబెడతానని నారా లోకేష్ చెప్పాడు: కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు
రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ను నిలబెడతానని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పాడని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. కళ్యాణదుర్గంలో మంగళవారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల నారా లోకేష్ ను కలిసిన సమయంలో ఆర్డీటీ ని కచ్చితంగా నిలబెడతానని ప్రతిపక్షాల మాటలు పట్టించుకోవద్దని చెప్పాడన్నారు. త్వరలోనే శుభవార్త వింటారన్నారు. అతి త్వరలో ఢిల్లీకి వెళ్లి మరోసారి కేంద్రం పెద్దలతో ఆర్డీటీ గురించి మాట్లాడతామన్నారు.