నారాయణ్‌ఖేడ్: మనూర్ లో మజినా ఆడుతూ కుప్పకూలిపోయి మృతి చెందిన 57 ఏళ్ల మచ్చుకూరి మల్గొండ
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్లో విషాదం చోటుచేసుకుంది. మనూర్లో జాతర సందర్భంగా గంధాలు ఊ రేగింపు చేశారు. ఊరేగింపులో మజీనా ఆడుతూ మనూర్ కి చెందిన మచ్కూరి మల్గొండ (57) వ్యక్తి కుప్పకూలి మృతి చెందాడు. ఆయన ఆడుతూ కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పీర్లకు గంధాలు తీస్తుండగా ఇలాంటి ఆశుభం జరగడం బాధాకరమని గ్రామస్థులు అంటున్నారు. నేడు అంత్య క్రియలు జరుగుతున్నాయి. మృతుడు సవారిలో ఉన్నట్లు చెప్పారు.