విజయవాడ రూరల్ యనమలకుదురు కరగట్టపై ఘోర రోడ్డు ప్రమాదం..ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి.
విజయవాడ రూరల్ బుధవారం యనమలకుదురు కరకట్టపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పెనమలూరుకి చెందిన ఆవాల వెంకటేశ్ (36) తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, ఇసుక లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.