ఆర్మూర్: ఆర్మూర్ రైతు వేదికలో అంకాపూర్ కు చెందిన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు
ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించారు. పట్టణంలోని రైతు వేదికలో బుధవారం మధ్యాహ్నం 1:30 సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవియా జిల్లా హౌసింగ్ బోర్డ్ పిడి పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఇండ్లను కేటాయించారు. మొత్తం 92 మంది లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించినట్లు తెలిపారు అనారోగ్యంతో 65 సంవత్సరాల పైబడిన వారికి గ్రౌండ్ పోర్షన్లను కేటాయించారు. ఈ నెల 26న ఇండ్ల పట్టాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. డ్రా పద్ధతి ద్వారా ఇండ్ల నంబర్లను లబ్ధిదారులకు కేటాయించారు.