పి.కొత్తకోటలో మంత్రి సత్య కుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు
శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం పి.కొత్తకోట ZPSH పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం మంత్రి సత్యకుమార్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. స్కూల్ అసిస్టెంట్ శేష ఫణి మాట్లాడుతూ.. 174 మంది విద్యార్థులకు పుస్తకాలు, పలకలు, పెన్నులు పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి మంత్రి సత్య కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.