నేరాలకు పాల్పడితే జైలు జీవితం తప్పదు : నెల్లూరు SP అజిత
నేరాలకు పాల్పడితే జైలు జీవితం తప్పదని జిల్లా ఎస్పీ అజిత రౌడీషీటర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. నెల్లూరు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో ఆదివారం ఉదయం పదిగంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు.. ప్రజా శాంతికి భంగం కలిగిస్తే సహించేదను.. ఎవ్వరిని ఉపేక్షించమని హెచ్చరించారు.. పద్ధతులు మార్చుకోవలన్నారు.. పాత నేరస్తులపై నిరంతర నిఘా ఉంటుందని.. తోక జాడిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.