అన్నమయ్య జిల్లా లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్
సోమవారం ఉదయం కలకడ మండలం బాట వారి పల్లి లో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే వేలిముద్ర తీసుకుని నగదును లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు. విభిన్న ప్రతిభావంతుల పింఛను వితంతు పింఛన్ మరియు వృద్ధాప్య పింఛన్ల పంపిణీ స్వయంగా పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇంటి వద్దనే పెన్షన్ అందుతుందా, ఏ రోజు పింఛను అందుతోంది, ఎన్ని గంటల సమయంలో అందుతుంది, వంటి ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుస