కుప్పం: పంట పొలాలపై ఏనుగులు దాడులు
రామకుప్పం మండలంలోని PMK తండా సమీపంలోని వ్యవసాయ పంటలపై రెండు ఏనుగులు దాడి చేసి వరి పంటను ధ్వంసం చేశాయి. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ దాడికి పాల్పడినట్లు రైతు చంద్ర నాయక్ తెలిపారు. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు ఫారెస్ట్ సిబ్బంది ప్రయత్నిస్తున్నా దాడులు ఆగడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.