తాడిపత్రి: తాడిపత్రిలో భార్యపై దాడి చేసిన కేసులో కోర్టు ఆదేశాలతో నిందితుడిని రిమాండ్కు పంపినట్లు తెలిపిన సీఐ శివగంగాధర్ రెడ్డి
భార్యపై కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు.. సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు. పుట్లూరు మండలం కడవకల్లుకు చెం దిన సురేష్ భార్యతో కలిసి తాడిపత్రికి వలస వచ్చి పాతకోటలో నివాసం ఉండేవాడు. కుటుంబ కల హాలతో 2018లో భార్యపై దాడి చేసిన కేసులో కోర్టు వాయిదాలకు హజరుకాకుండా పరారీలో ఉన్నాడు. సురేష్ పై తాడిపత్రి మెజిస్ట్రేట్ నాన్ బెయి లబుల్ వారెంట్ జారీ చేశారు. నిందితుడు కడవక ల్లులో ఉండగా అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు నిండితుడికి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.