మేడ్చల్: కీసరలో పెద్దమ్మ గుడి వద్ద రోడ్డు ప్రమాదం
కీసరలో సోమవారం కార్తీక మాసం సందర్భంగా పెద్దమ్మ గుడి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వనభోజనాలకు బైక్ పై వచ్చిన వెంకటరమణ అనే వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన అశోక లీలా అంటే వాహనం ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడ మృతి చెందాడు. కీసర పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.