బహుదానది వంకలో నీట మునిగి యువకుడు మృతి
బహుదానది వంకలో నీట మునిగి యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం కలకడ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సంబేపల్లి మండలం దేవపట్లకు చెందిన అజంతుల్లా కుటుంబ సభ్యులతో ఆదివారం విహారయాత్రకు కేవిపల్లి మండలంలోని జరికోన ప్రాజెక్టుకు బయలుదేరారు. అయితే దారి మధ్యలో కలకడ మండలం బాలయ్యగారి పల్లి పంచాయతీ నుంచి తువ్వపల్లికి వెల్లే మార్గంలోని బహుదా నది వంకలో అజంతుల్లా ఈత కొడుతూ ప్రవాహానికి తూములోకి వెళ్లి చిక్కుకు పోయాడు.అజంతుల్లాను తూము నుంచి హుటాహుటిన కుటుంబ సభ్యులు బయటకు లాగి 108 ద్వారా మహల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.