రామాయంపేట మండల పరిధిలో డి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రక్త పరీక్షల గది, ఎక్స్ రే, ల్యాబ్ గదులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరెవరు ఏ రుగ్మతతో వచ్చారని వాకబు చేశారు. ఆస్పత్రిలో జరిగిన ప్రసవాలు, ఇప్పటి వరకు జరిగిన ప్రసవాల వివరాల రికార్డ్ లను పరిశీలించారు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా తదితర వ్యాధుల నమోదు, సాధారణ ప్రసవాలు, సిజరిన్ లు ఎన్ని జరిగాయని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.