కోయిల్ కొండ: భారీ వర్షాలు అప్రమత్తంగా కోయిలొకొండ మండల ప్రజలు ఉండండి:ఎస్ఐ తిరుపాజీ
జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో కోయిలొకొండ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. పాత ఇళ్లలో ఉండేవారు తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్నారు. చెరువులు, వాగుల దగ్గరికి వెళ్లకూడదని చెప్పారు. తడిచేతులతో లైట్లను ఆన్ చేయొద్దని తెలిపారు. రోడ్లపై ఉన్న స్తంభాలను తాకవద్దు, వాహనదారులు జాగ్రత్తగా నడపాలని ఎస్ఐ తిరుపాజీ సూచించారు.