కుప్పం: పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తాం: తహశీల్దార్ చిట్టిబాబు
కుప్పం మండలంలోని చెక్కునత్తం హరిజనవాడలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులను కల్పిస్తామని తహశీల్దార్ చిట్టిబాబు పేర్కొన్నారు. చెక్కునత్తం హరిజనవాడలో శనివారం తహశీల్దార్ పర్యటించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందని అన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.