ప్రొద్దుటూరు: మహర్షి స్కూల్ ఆస్తుల ఆక్రమణపై కోర్టులో పిల్ వేశాం: వైసిపి పట్టణ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి
Proddatur, YSR | Oct 26, 2025 ప్రభుత్వ నిషేదించ జాబితాలోని కడప జిల్లా ప్రొద్దుటూరు మహర్షి స్కూల్ ఆస్తుల ఆక్రమణ పై కోర్టులో పిలు వేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రిజిస్ట్రేషన్ ఆస్తులను తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వాటిని అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోర్టులో పిల్ వేశామని తెలిపారు.