పామాయిల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా
Eluru Urban, Eluru | Sep 15, 2025
ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పామాయిల్ గెలలు దిగుమతి విషయంలో కార్మికుల పాత్ర చాలా కీలకం అని, దిగుమతి సమయంలో చాలామంది విద్యుత్ షాక్ లకు, ప్రమాదాలకు గురవుతున్నారని, అటువంటివారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడిన లేక మృత్యువాత పడిన వారికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ సెల్వికి వినతిపత్రం సమర్పించారు.