తాడిపత్రి: తాడిపత్రిలోని శ్రీ వేంకటరమణ స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించిన మున్సిపల్ చైర్మన్ జే సీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రి లోని అతి పురాతనమైన, పవిత్రమైన శ్రీ వేంకట రమణ స్వామికి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సతీ సమేతంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పట్టు వస్త్రాలను స్వామికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.