కళ్యాణదుర్గం: నారాయణపురం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ఉపాధి హామీ సిబ్బంది
కళ్యాణదుర్గం మండలం నారాయణపురం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో అవినీతి, అక్రమాలకు ఉపాధి హామీ సిబ్బంది పాల్పడుతున్నారని గ్రామస్తులు బుధవారం ఆరోపించారు. ఉపాధి హామీ సిబ్బంది జేసీబీ ల సాయంతో పనులు చేయించి వాటిని కూలీలు చేయించినట్లు మాస్టర్లో నమోదు చేసి బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. బోగస్ కూలీల పేర్లతో పనులు చేయకపోయినా చేసినట్లు సిబ్బంది బిల్లులు డ్రా చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉపాధి హామీ పీడీ, ఎంపీడీవో స్పందించి ఈ ఘటనపై లోతుగా విచారణ చేసి సంబంధిత ఉపాధి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.