అమీర్పేట: JNTUHలో ప్రో. నాగరత్నం నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం: గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది JNTUH లో కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ నాగరత్నం ద్వారా జరిగిన అవకతవకల్లో ఆమెను తొలగించారని అన్నారు. కానీ ప్రస్తుతం వచ్చిన వైస్ ఛాన్స్లర్ కిషన్ రెడ్డి ఆమెను అదే ప్లేస్ లో నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని ఆయన తెలిపారు.