అసిఫాబాద్: బీసీ బంద్ కు మున్నూరు కాపు మద్దతు
ఈనెల 18న బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన బంద్ కు మున్నూరు కాపు సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆ సంఘం మండల అధ్యక్షులు గణపతి అన్నారు. బీసీ రిజర్వేషన్ అమలులో శాస్త్రీయత ఉంటే ఆఖరి వరకు తోడుగా ఉంటామని మున్నూరు కాపు సంఘం నాయకులు అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు సంఘం సమావేశం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు.