శ్రీకాకుళం: ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు ఆపమన్న ఆపలేదని కొత్త రోడ్ జంక్షన్ వద్ద బస్సు కు అడ్డంగా ద్విచక్ర వాహనాన్ని పెట్టిన ప్రయాణికుడు
ఉచిత బస్ పేరిట ఆర్టీసీ కష్టాలు... రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సర్వీసును ఏర్పాటు చేయడంతో ఆర్టీసీ బస్సు కష్టాలు మొదలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఓ మహిళ పాసింజర్ పాలకొండ వెళ్లేందుకు స్థానిక ఆదివారం పేట జంక్షన్ వద్ద బస్సు ను ఆపడానికి ప్రయత్నించుగా సదరు బస్సు డ్రైవరు బస్సును ఆపకుండా వెళ్లిపోయాడు. వెంటనే ఆ మహిళ తన భర్త ద్విచక్ర వాహనం మీదగా ఆర్టీసీ బస్సు వెంబడిస్తూ స్థానిక కొత్త రోడ్ జంక్షన్ వద్ద బస్సు కు అడ్డంగా వాహనాన్ని నిలిపి బస్ డ్రైవర్ తో వాగ్వాదం పెట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా ట్రాఫిక్ స్తంభించుకోవడంతో స్థానికులు కలుగజేసుకొని తగాదాను ఆపారు..