అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో శివకృష్ణ అనే వ్యక్తి ఇంట్లో వంకాయలో ఓంకార రూపం దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన శివకృష్ణ ఇంట్లో వంట చేసేందుకు ఆదివారం కత్తితో వంకాయ కోసారు. వంకాయను రెండుగా చేసి చూడడంతో అందులో ఓంకార రూపం కనిపించింది. దీంతో శివకృష్ణ కుటుంబసభ్యులు ఓం రూపం కన్పించిన వంకాయను పూజ గదిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఇదంతా తమ అదృష్టమని శివకృష్ణ కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఓంకార రూపంలో ఉన్న వంకాయ రెండు ముక్కలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.