అవనిగడ్డలో వైద్యానికి లోటు లేకుండా ప్రభుత్వ సహాయం
Machilipatnam South, Krishna | Sep 23, 2025
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పేదల వైద్యానికి లోటు లేకుండా సహాయం చేస్తోందని తెలిపారు. మంగళవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 16వ విడత సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం చెక్కులు, ఎల్ఎసీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏడుగురు లబ్ధిదారులకు రూ. 12,01,377ల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పేదలకు మెరుగైన వైద్యాన్ని సకాలంలో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.