జిల్లా అభివృద్ధి లక్ష్యంగా కలిసి పని చేద్దాం:
ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ
Anantapur Urban, Anantapur | Sep 16, 2025
జిల్లా అభివృద్ధి లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ కోరారు. మంగళవారం ఉదయం 11 గంటలకు సమయంలో స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమావేశ భవనంలో 14వ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ అధ్యక్షులు బోయ గిరిజమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణన్ శర్మ, శ్రీ సత్య సాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ , జడ్పిటిసిలు ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.