ఏటిమొగ గ్రామంలోపర్యటించిన కలెక్టర్
Machilipatnam South, Krishna | Sep 17, 2025
నాగాయలంక మండలం ఏటిమొగలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం పర్యటించారు. త్వరలో ఎదురుమొండి దీవుల్లో జరగనున్న కరకట్ట రోడ్డు శంకుస్థాపనకు ఉప ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సభా స్థలం ఎంపిక కోసం వారు ఏటిమొగలోని జడ్పీ హైస్కూల్ గ్రౌండ్, దివి వ్యవసాయ మార్కెట్ యార్డులను పరిశీలించారు.