షరతులు లేకుండా రైతులకు యూరియా అందించాలి:కిషన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జి. సజ్జా రెడ్డి
ఎలాంటి షరతులు లేకుండా రైతులకు అవసరం అయిన యూరియాను సరఫరా చేయాలని జిల్లా కిషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు జి. సజ్జా రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం ఆ సంఘం ఆధ్వర్యంలో పలువురు రైతులు పుట్టపర్తి కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. అనంతరం ఇంచార్జ్ డిఆర్ఓ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా లో పలు గ్రామాలలో రైతులు వరి నాట్లు వేశారన్నారు. అకాల వర్షాలు వల్ల వేసిన నాట్లు నిలదొక్కుకోవాలంటే తక్షణం యూరియా అవసరం అన్నారు. ఒక రైతుకు ఒక బస్తా అనే షరతు తొలగించి ఎంత అవసరముంటే అంత యూరియా సరఫరా చేయాలన్నారు.సహకార సంఘాల ద్వారా సక్రమంగా యూరియా ఇవ్వడంలేదన్నారు.