పాడేరు రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
పాడేరు తలారి సింగి వద్ద ఐటీడీఏ పెట్రోల్ బంక్ ఎదుట సోమవారం రాత్రి 8 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. హుకుంపేట వ్యవసాయ పనిముట్లు దుకాణంలో పనిచేస్తున్న థామస్ ప్రవీణ్ అనే యువకుడు హుకుంపేట నుండి పాడేరు వస్తున్న క్రమంలో తలరసింగి పెట్రోల్ బంక్ నుండి బయటకు వస్తున్న జెసిబిని బలంగా ఢీకొట్టాడు, తీవ్రంగా గాయాలు పాలైన ప్రవీణ్ ను స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాడేరు జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని చేర్చారు మృతుల బంధువులను ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు పరామర్శించారు.