కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని ఉప్పులూరు, కంకిపాడు గ్రామాల్లో సంక్రాంతి వేడుకల నడుమ కోడిపందేలు, పేకాట శిబిరాలు జోరుగా సాగుతున్నాయి. ఈ అక్రమ కార్యకలాపాలను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. పందేల వద్ద రద్దీ పెరగడంతో సందడి నెలకొంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నా అధికారుల పర్యవేక్షణ కనిపించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.