తిమ్మాపురం వద్ద రోడ్డు ప్రమాదం ,ఆటో బోల్తా ,మహిళకు తీవ్ర గాయాలు
Dhone, Nandyal | Sep 15, 2025 నంద్యాల జిల్లా డోన్ మండలం తిమ్మాపురం గ్రామం వద్ద సోమవారం ఆటో బోల్తా పడింది ఈ ఘటనలో తిమ్మక్క అనే మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి మిగిలిన వారికి స్వల్ప గాయాలు కావడంతో పెను ప్రమాదం తప్పింది. తిమ్మక్కను మొదట డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు