అల్లాపూర్ డివిజన్ గాయత్రి నగర్ లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జి బండి రమేష్ పాదయాత్ర నిర్వహించారు. స్థానికులతో కలిసి అభివృద్ధి పనులు పరిశీలించిన రమేష్ కు ప్రజలు గత పది ఏళ్లలో అభివృద్ధి లోపాన్ని, నాసిరకం పనులను వివరించారు. కాంట్రాక్టర్ల మేలు మాత్రమే జరిగిందని, ప్రజలకు ఉపయోగం లేదని వాపోయారు. ప్రజా ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు.