బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు: జిల్లా ఎస్పీ
Ongole Urban, Prakasam | Jun 13, 2025
ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ శ్రీ వరాహా లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం కళ్యాణోత్సవం మరియు రథోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ అక్కడ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా జిల్లా ఎస్పీ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం ఆలయ పరిసరాలు, ప్రవేశ మార్గములు, క్యూలైన్లను భద్రతా మరియు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. దేవాలయం, రథం వద్ద భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. దర్శనానికి విచ్చేసే భక్తులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.