గంగాధర నెల్లూరు: వెదురుకుప్పం మండలం తంగేళిమిట్ట వద్ద నీటిలో బైక్ తోపాటు పడిపోయిన యువకుడు ...కాపాడిన స్థానికులు
రాత్రి కురిసిన భారీ వర్షానికి బుధవారం వెదురుకుప్పం మండలం తంగేళిమిట్ట వద్ద ఉన్న వంక ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇది గమనించని ఓ యువకుడు బైకుతో రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. వాహనంతో పాటు కిందపడిపోయాడు. స్థానికులు వెంటనే గమనించారు. బైకుతో పాటు కొట్టుకుపోతున్న యువకుడి ధైర్యం చేసి కాపాడారు.