షేక్ పేట్: బర్త్ డే సందర్భంగా సినీ హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద తోపులాట, కింద పడిన మహిళకు స్వల్ప గాయాలు
మంగళవారం ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్దకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. ఫ్యాన్స్ ను ఆపేందుకు పోలీసులు బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు. అయితే మంగళవారం సాయంత్రం అభిమానులు వాటిని తోసుకుంటూ ఒక్కసారిగా దూసుకు రావడంతో ఓ మహిళ కింద పడింది. అయితే పోలీసులు వెంటనే స్పందించి మహిళను పైకి లేపడంతో ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో మహిళలకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.