తాడిపత్రి: యాడికి లోని పురాతనమైన పెద్దమ్మ ఆలయంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, చండికా దేవి అలంకరణలో పెద్దమ్మ
యాడికి మండల కేంద్రంలోని పురాతనమైన, పవిత్రమైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో బుధవారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని చండికాదేవి అలంకరణ గావించారు. 11 మంది దంపతులు చండీ హోమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వినియోగం చేశారు. ఆలయంతో పాటు పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లి విరిసింది.