వానవోలు గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్
శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలంలోని వానవోలు గ్రామంలో సోమవారం మధ్యాహ్నం మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె వైస్సార్సీపీ డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు. ఈ డిజిటల్ బుక్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పడే కష్టాలను, బాధలను పొందుపరచవచ్చని ఆమె తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కనపెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని ఉషాశ్రీచరణ్ ఆరోపించారు.