కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని కాశినాయన మండలంలో ట్రాక్టర్ దొంగతనం కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు.ఇటీవల కాశీనాయన మండలం సావిశెట్టిపల్లెకు చెందిన ముడుమాల సుదర్శన్‌రెడ్డికి చెందిన ట్రాక్టరు, టిల్లర్ గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని తెలిపారు. కేసు విచారణ చేసి ట్రాక్టర్‌ను దొంగిలించి తీసుకపోయిన పొట్లదుర్తికి చెందిన ముద్దాయి పులి అంజన కుమార్ ని అరెస్టు చేసి,అతని నుంచి ట్రాక్టర్, టిల్లర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.