ప్రత్తిపాడు: గుర్తుతెలియని వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోయిన వాహనం.. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లపాడు రోడ్డు, శ్రీనివాస కాలనీ వద్ద గుర్తుతెలియని వ్యక్తిని ఓ వాహనం ఢీకొట్టి వెళ్లిపోయినట్లు నల్లపాడు సిఐ వంశీధర్ సోమవారం రాత్రి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. వాహనం ఢీకొట్టిన ప్రాంతంలోని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు చెప్పారు. మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మృతుడు ఆచూకీ తెలిసినవారు నల్లపాడు పోలీసులను సంప్రదించాలని సూచించారు.