అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పోలీసుల తీరుపై శాలివాహన సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మూడవ పట్టణ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ తో వారు వాగ్వివాదం చేశారు. సతీష్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై అడ్డుకున్నందుకు వెళ్లిన సీఐపై వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.