నంద్యాల జిల్లా గోపవరం మెట్ట సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడ్డాడు, సిరివెళ్ల మండలం మహాదేవపురం గ్రామానికి చెందిన బాధితుడు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి కింద పడిపోయారు, గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 వాహనం ద్వారా ఆయనను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది