కనిగిరి ఆర్టీసీ డిపో నుండి పాకాల బీచ్ ఫెస్టివల్ కు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు కనిగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ సయనా బేగం గురువారం తెలిపారు. ఈనెల 14, 15 తేదీల్లో పాకల బీచ్ ఫెస్టివల్ జరగనుంది అన్నారు. బీచ్ ఫెస్టివల్ జరిగే రెండు రోజులు కనిగిరి ఆర్టీసీ డిపో నుండి ప్రత్యేక బస్సులను నడుపుతామన్నారు. మహిళలకు శ్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందన్నారు. పాకాల బీచ్ ఫెస్టివల్ కు వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ సూచించారు.