మూసాపేట్ డివిజన్ భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 30 న జరిగిన నలభై లక్షల రాబరీ కేసును హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు చేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 34 లక్షల 66000 నగదు, ఐదు సెల్ ఫోన్లు, ఒక కత్తి, రెండు ద్విచక్ర వాహనాలు,మాస్క్ లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.