జగ్గంపేట మండలంలో పలు గ్రామాల్లో శనివారం విద్యుత్ అంతరాయం
జగ్గంపేట మండలంలో పలు గ్రామాల్లో శనివారం విద్యుత్ అంతరాయం కలుగుతుందని ఎలక్ట్రికల్ ఏఈ వీరభద్రరావు తెలిపారు. పెద్దాపురం - జగ్గంపేట 33kv ఫీడర్లో కాట్రావులపల్లి వద్ద 33KV ఏబీ స్విచ్ ఎరిక్షన్ కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు కాట్రావులపల్లి, సూరంపాలెం గ్రామాలకు, వ్యవసాయ బోరులకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయబడును అని, అదేవిధంగా 11KV జగ్గంపేట -నరేంద్రపట్నం ఫీడర్ ,జగ్గంపేట ఇండస్ట్రియల్, రాజపూడి ఇండస్ట్రియల్ ఫీడర్ నందు RDSS work కారణంగా ఉదయం "9:00 గం" నుండి మధ్యాహ్నం 02:00గం"ల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయబడుతుంది.