వనపర్తి: ఖిల్లా ఘనపూర్:నాయి బ్రాహ్మణులకు దేవదాయ శాఖలో పదవులు కేటాయించాలి
దేవాదాయ శాఖలో నాయి బ్రాహ్మణులకు నామినేటెడ్ పోస్టులు కేటాయించాలని నాయి బ్రాహ్మణ సంఘం ఖిల్లా ఘనపూర్ మండల అధ్యక్షుడు బెన్నూరు ఆశన్న ఆదివారం బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు సూర్య రావు కు వినతి పత్రం అందజేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించిన బీసీ సమాజ్ ఆత్మీయ సమయంలో నాయి బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు ఆశన్న మధ్యాహ్నం మూడు గంటలకు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు క్షౌర వృత్తి, నాదాస్వరం వృత్తి లో దేవాదాయ శాఖ లో పనిచేస్తున్నారని గుర్తు చేశారు.