జమ్మలమడుగు: కమలాపురం : మండలంలోని కొత్తపల్లి వద్ద కుక్కల దాడిలో 15 గొర్రెల మృతి
కడప జిల్లా కమలాపురం మండలం ఎర్రవల్లి కొత్తపల్లి వద్ద గురువారం కుక్కల దాడిలో 15 గొర్రెల మృతి చెందగా మరికొన్ని గొర్రెలకు గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ఖాజీపేట మండలం తిప్పాయపల్లె నుండి జీవనోపాధి కోసం గొర్రెలు మేపుకోవడానికి వెళ్లి కుక్కల దాడిలో మల్లయ్య గొర్రెలు చనిపోవడంతో గొర్రెల కాపర్లు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటనలో దాదాపు దాదాపు ఒక లక్ష యాభై వేల రూపాయల నష్టం వాటిలిందని ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.