శ్రీకాళహస్తిని జల్లెడ పడుతున్న పోలీసులు శ్రీకాళహస్తిలో టూ టౌన్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. టూ టౌన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ పార్సిల్ కేంద్రాన్ని సీఐ నాగార్జున రెడ్డి తన సిబ్బందితో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం రైల్వే స్టేషన్ను తనిఖీ చేసి, ప్రయాణికులను విచారించారు. ఢిల్లీలో జరిగిన బాంబు బ్లాస్ట్ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.