కర్ణాటకనాగేపల్లిలో నిత్యం మద్యం సేవించి వచ్చి తన తల్లిని దూషిస్తున్నాడని ఓ వ్యక్తిపై యువకులు కత్తితో దాడి
మద్యం సేవించి వచ్చి ఓ వ్యక్తి నిత్యం తన తల్లిని దూషిస్తున్నాడని యువకులు అతనిపై కత్తితో దాడి చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కర్ణాటక నాగేపల్లెలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్న వెంకటేష్ గుజ్జల సుధాకర్ తిరుపాలు సాయికుమార్ పందుల పెంపకంతో జీవనం సాగించేవారు. ఎరుకల చిన్న వెంకటేష్ నిత్యం మద్యం సేవించి వచ్చి సుధాకర్ తల్లిని దూషిస్తుండడంతో సోమవారం రాత్రి సుధాకర్ వెంకటేష్ పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.