ప్రకాశం జిల్లా గిద్దలూరు తాహసీల్దార్ కార్యాలయాన్ని ఓఎల్ఎక్స్ లో గుర్తుతెలియని వ్యక్తి అమ్మకానికి పెట్టాడు. కార్యాలయం ఫోటోని యాప్ లో అప్లోడ్ చేసి రూ.20 వేలు అమ్ముతున్నట్లు సందేశం పెట్టాడు. గత రెండు రోజులుగా ఈ ఫోటో ఓఎల్ఎక్స్ లో వైరల్ గా మారడంతో అధికారులు ఈ ఘటనపై దృష్టి సారించారు. స్థానిక తహసీల్దార్ ఆంజనేయ రెడ్డి ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే అధికారులు ఈ ఘటనపై స్పందించేందుకు నిరాకరించారు. ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది.