సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య ముమ్మాటికీ కాంగ్రెస్ గుండా నాయకులే చేశారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్ ఆరోపించారు. శుక్రవారం ASF ప్రజా సంఘాల కార్యాలయంలో వారి చిత్ర పటానికి పూలమాలతో నివాళులర్పించి మాట్లాడారు.. వారి మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని తెలిపారు. పోలీసులు ఎవరి ఒత్తిడికి లొంగకుండా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.