పుంగనూరు: యద్దలకుంట చెరువుకు గండి.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న యద్దలకుంట చెరువుకు మంగళవారం మధ్యాహ్నము 3 గంటల ప్రాంతంలో గండిపడింది. గత కొన్ని రోజులకు కురుస్తున్న వర్షాలకు యద్దలకుంట చెరువు పూర్తిస్థాయిలో నిండింది. యద్దాలకుంట చెరువుకు గండిపడిన ఘటన స్థలానికి రైతులు చేరుకుని ఇరిగేషన్ అధికారులకు సమాచారం తెలిపారు.