శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని అమ్మడు మండలం కొట్టువాని పల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ అని వృద్ధుడు ఆసుపత్రిలోని అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. ఈనెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అతనిని వారి కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.